
జమ్మికుంట, జూన్ 27 (జిందగీ9 న్యూస్):జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఈరోజు వైద్య శిబిరం నిర్వహించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో డాక్టర్ సంధ్యారాణి నేతృత్వంలో 34 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత నివారణ, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పోషకాహారాన్ని తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, స్పెషల్ ఆఫీసర్ సుప్రియ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ANMలు సరళ, రమాదేవి, ఆశా కార్యకర్త స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
