
బునియాదిపూర్: పీఎం శ్రీ ప్రాథమికోన్నత పాఠశాల బునియాదిపూర్ లో శుక్రవారం యువ నాయకుడు మల్లేశ్ యాదవ్ పలు విద్యాసహాయక పదార్థాలను విద్యార్థులకు వితరణ చేశారు. తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా పలకలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ, “గ్రామ విద్యార్థులు మెరుగైన విద్య పొందాలన్నదే నా ఆకాంక్ష. చిన్నతనం నుంచే చదువుపట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలి” అని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగ శేషు, ఉపాధ్యాయులు దయానంద్, గ్రామ మాజీ సర్పంచులు నరేందర్, వెంకటేశ్ సాగర్, సీనియర్ నాయకులు వనంతి త్రుపతయ్య యాదవ్, నాగన్న యాదవ్, యువ నాయకులు మేకల రాములు, గుడిసె మహేష్, శ్యామ్ సుందర్, శ్రీకాంత్, సాయి సాగర్, ఫిరోజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వితరణ చేసిన మల్లేశ్ యాదవ్కు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు నాగ శేషు కృతజ్ఞతలు తెలిపారు.
