కరీంనగర్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించడం లేదని అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేశారు.
నియమాల ఉల్లంఘన – అధికారులపై తీవ్ర విమర్శలు
సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నామినేషన్ సమయంలో తన వాహనాలను అడ్డుకుని, మంత్రుల వాహనాలను అనుమతించడాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా, తన పేరు సీరియల్ నంబర్లో ముందుగా రాకుండా చేయడానికి కుట్ర జరిగిందని పేర్కొన్నారు.
ఓటరు వివరాల గోప్యత ఉల్లంఘన – వెబ్‌సైట్‌పై ఫిర్యాదు
ఓటరు వివరాలు www.vnrmlc.com అనే అనధికార వెబ్సైట్లో బహిరంగంగా ఉంచబడుతున్నాయని, ఇది గోప్యతా హక్కు ఉల్లంఘన అని ఆరోపించారు.ఈ వెబ్సైట్ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్ల వ్యక్తిగత వివరాలు (పేరు, మొబైల్ నంబర్, చిరునామా) లీక్ అవుతున్నట్లు ఆరోపించారు.ఎన్నికల కమిషన్ అధికారి మౌనం వెనుక కుట్ర ఉందని విమర్శించారు.సైబర్ క్రైమ్ & ఎన్నికల కమిషన్ ఈ వెబ్‌సైట్‌పై దర్యాప్తు చేసి తక్షణమే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు.IT చట్టం, 2000 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
“ఇదంతా గాంధీ భవన్ ఎన్నికలా?” – సర్ధార్ రవీందర్ సింగ్ విమర్శలు
“ఓటరు జాబితా లీక్ అయ్యేంత స్థాయికి అధికారుల ప్రమేయం ఉందని ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలను ఇష్టమొచ్చినట్లు నిర్వహించాలనుకుంటే అధికారులే ఎన్నికల కుర్చీల్లో కూర్చొని ఓట్లు వేయించుకోండి” అంటూ సర్ధార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు.
తక్షణ చర్యల కోసం డిమాండ్
• ఈ సమస్యను పరిష్కరించడానికి,
• వెబ్‌సైట్‌ను తక్షణమే బ్లాక్ చేయాలి.
• దీనికి బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించాలి.
• ఎన్నికల కమిషనర్‌ను తక్షణమే మార్చాలి.
ఈ సమావేశంలో న్యాయవాదులు సుంకె దేవకిషన్, మురళీ, లింగంపల్లి నాగరాజు, శరత్ చందర్ రావు, వినయ్, రాజ్ కుమార్, వేముల సందీప్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
