హుజురాబాద్: ఉద్యోగం దొరకకపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి తండ్రి వేల్పుల సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జమ్మికుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మామిండ్లవాడకు చెందిన వేల్పుల అజయ్ కుమార్ (20) డిగ్రీ పూర్తి చేసినప్పటికీ సరైన ఉద్యోగం దొరకక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఫిబ్రవరి 11న న జమ్మికుంట మడిపల్లి రోడ్డు వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు అతడిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు.అయితే, చికిత్స పొందుతూ శనివారం (ఫిబ్రవరి 22) న యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
