
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై లంచం…ఏసీబీ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ & మండల పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్‌కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడి భార్యకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద నిర్మాణంలో ఉన్న ఇంటి ఫోటోలను హౌసింగ్ యాప్‌లో దశలవారీగా అప్లోడ్ చేసి, రూ.1,40,000 మంజూరు అయ్యేలా చేయడానికై రాజ్‌కుమార్ రూ.5,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
