
ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్ (1800-599-5991)ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు.
ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా కాల్స్‌ను అటెండ్ చేస్తూ ప్రజలతో మాట్లాడారు.
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం నుంచి కాల్ చేసిన లబ్ధిదారుడు తన ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయినా బిల్లు రాలేదని చెప్పగా, మంత్రి ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలు పరిశీలించి, వచ్చే సోమవారం లక్ష రూపాయలు ఖాతాలో జమ అవుతాయని భరోసా ఇచ్చారు. మరో కాలర్ హైదరాబాద్‌లో ఇళ్ల మంజూరు గురించి అడగగా, నివాస స్థలాల కొరత వల్ల కొంత ఆలస్యం జరిగిందని, త్వరలోనే అర్హులందరికీ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ –
🔹 లబ్ధిదారుల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని
🔹 బిల్లులు జమ కాకపోవడం, ఫోటో అప్‌లోడ్‌లో ఆలస్యం, సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై వెంటనే స్పందిస్తామని
🔹 ఇందిరమ్మ యాప్, కృత్రిమ మేధ (AI) వంటి సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల సబ్సిడీతో ఇండ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
📌 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబరు : 1800 599 5991
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
