న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank – IPPB) 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ (Circle Based Executive – CBE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 21, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 51
అర్హత: కనీసం డిగ్రీ (Degree) పూర్తి కావాలి
వయస్సు: 20 నుండి 35 సంవత్సరాల మధ్య (ఫిబ్రవరి 1, 2025 నాటికి)
ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, మెరిట్ & ఇంటర్వ్యూ ద్వారా
జీతం: నెలకు రూ.30,000లు
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank – IPPB) అధికారిక వెబ్సైట్ ippbonline.com ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/OBC అభ్యర్థులకు: రూ.750లు
SC/ST/PWD అభ్యర్థులకు: రూ.150లు
ఇతర వివరాలకు IPPB అధికారిక నోటిఫికేషన్ను సందర్శించండి.
