అసమాన ఆస్తుల కేసులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి గౌస్ పాషాపై ఏసీబీ కేసు నమోదు
మహబూబాబాద్: సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ & మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు బాధ్యతలతో) ఉన్న మొహమ్మద్ గౌస్ పాషాపై ఎంటీ-కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు అసమాన ఆస్తుల కేసును నమోదు చేశారు.
ఏసీబీ అధికారులు మొహమ్మద్ గౌస్ పాషా నివాసంతో పాటు, ఆయన బంధువులకు చెందిన మొత్తం 5 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థిర & చరాస్తులను గుర్తించారు.
గృహాలు – 2, ఓపెన్ ప్లాట్లు – 25, వ్యవసాయ భూములు – 10.36 ఎకరాలు, వాహనాలు – 3.
మొత్తం ఆస్తుల విలువ రూ.3,51,06,759/- (మార్కెట్ విలువ ఆధారంగా)గా అంచనా వేశారు.
అసమాన ఆస్తుల కలిగి ఉన్న కారణంగా ఏసీబీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచినట్లు అధికారులు తెలిపారు.
