అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ప్రతిష్టాత్మక వెంకట్ ఫౌండేషన్ వై. రఘునాథం ఎక్సలెన్స్ అవార్డు
కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు ప్రదానం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో ఆదర్శంగా నిలుస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వి. నరేందర్ రెడ్డికి ప్రతిష్టాత్మక వెంకట్ ఫౌండేషన్ వై. రఘునాథం ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
ఈ అవార్డును స్థానిక కరీంనగర్ శివారులోని ఒక ప్రైవేటు వేడుక మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ (రిటైర్డ్ ఐపీఎస్), వెంకట్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ గంప వెంకట్, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు, “తెలంగాణ విద్యారంగంలో మార్గదర్శిగా నిలుస్తూ, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతున్న డా. నరేందర్ రెడ్డి సేవలు అభినందనీయం” అన్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థలు గత 35 ఏళ్లుగా విద్యారంగానికి విశేష సేవలు అందిస్తున్నాయని, పలు ప్రతిష్టాత్మక పదవుల్లో స్థిరపడేందుకు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ సంస్థల పాత్ర గొప్పదని వారు గుర్తించారు.
అవార్డు స్వీకరించిన డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. ఇది నాకు తోడ్పాటునిచ్చిన టీమ్ సభ్యులు, నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను” అంటూ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
