
హుజురాబాద్: నగరంలోని ప్రతాపవాడకు చెందిన నవజీవన్ సామిల్ వ్యాపారి రావుల ప్రభాకర్ తన కుమారుడు నాగేంద్ర వివాహాన్ని పురస్కరించుకుని ఆదివారం వెంకటసాయి గార్డెన్లో మునిసిపల్ సిబ్బంది 150 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. మహిళలకు చీరలు, జాకెట్ పీసులు, పురుషులకు షర్టు, ప్యాంటు పీసులు అందజేశారు. మొత్తంగా రూ.75 వేలు విలువైన బట్టలను పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు.
