
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో మంగళవారం ఉదయం 4:30 గంటలకు, గాంధీ చౌరస్తా నుండి హుజురాబాద్ వెళ్తున్న వ్యక్తి హోండా బైక్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డుపై కట్లు కొడుతూ వెళ్లాడు. ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశంతో, బ్లూ కోడ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు మహేందర్, చిట్టిబాబు చర్యలు చేపట్టారు. వాహనదారుడు కల్లుపల్లి గ్రామానికి చెందిన రాపర్తి అనిల్‌గా గుర్తించి, అతనిపై కేసు నమోదు చేశారు.
