జమ్మికుంట, ఫిబ్రవరి 21, 2025: ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మర్రి తిరుపతిరెడ్డి (45) జమ్మికుంట మార్కెట్లో కూరగాయలు విక్రయించి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, జమ్మికుంట బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురయ్యారు.ఉదయం 4:00 గంటల సమయంలో, TS-02-FE-8080 నంబర్ గల కారు అతివేగంగా, అజాగ్రత్తగా ఎదురుగా వచ్చి మర్రి తిరుపతిరెడ్డిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల, కుడి కాలుకు, కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.కారు నడిపిన వ్యక్తిని గుర్తించగా, మొట్లపల్లి గ్రామానికి చెందిన సామల ప్రతాప్ రెడ్డి అని తెలిసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
– Zindagi9News
