అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవండి – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ జిల్లా, ఏప్రిల్ 09 (జిందగీ9 న్యూస్): మావోయిస్టులు అజ్ఞాతం వీడి, సామాన్య జనజీవితంలో కలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు.గత ఫిబ్రవరి 21న వరంగల్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు వంజం కేశే అలియాస్ జెన్నీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 4 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కమిషనర్ స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “అడవులు వదిలి హింసా మార్గాన్ని విడిచిపెట్టి మావోయిస్టులు సామాజిక జీవనంలోకి రావాలి. ప్రభుత్వం లొంగిపోయిన వారికి పునరావాస పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు అందిస్తోంది. వాటిని వినియోగించుకుని కుటుంబాలతో కలసి ప్రశాంతమైన జీవితం గడపాలి” అన్నారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, తిరుమల్, కాజిపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
