శ్రవణ్ మరణం మండల బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్
టేకుమట్ల, ఏప్రిల్ 09 (జిందగీ9 న్యూస్):టేకుమట్ల టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కే.సి.ఆర్. అభిమాని ఓనపాకల శ్రవణ్ అనారోగ్య కారణాలతో మంగళవారం రోజున అకాలమరణం చెందారు. ఈ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు శ్రవణ్ పార్థివదేహానికి గులాబీ జెండా కప్పి, పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దహన సంస్కార ఖర్చుల నిమిత్తం బీఆర్ఎస్ మండల నాయకులు శ్రవణ్ కుటుంబానికి రూ.12,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్ మాట్లాడుతూ, “శ్రవణ్ వంటి నిబద్ధత గల కార్యకర్తను కోల్పోవడం మండల బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన వంటి కార్యకర్తలే పార్టీకి బలంగా నిలుస్తారు. ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు” అన్నారు. శ్రవణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టేకుమట్ల మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, బందెల నరేష్, మాజీ ఎంపీటీసీ ఆది రఘు, పింగిలి వెంకటేశ్వర్ల రెడ్డి, పోతనవేన ఐలయ్య, మాజీ సర్పంచులు ఉద్ధమారి మహేష్ యాదవ్, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డు సదానందం, మారం లింగారెడ్డి, దొడ్ల కోటి, ఓదెల రాజకుమార్, గువ్వాడి లక్ష్మణ్, మామిడి తిరుపతి, నిమ్మల స్వామి, మారపెల్లి కొమురయ్య, ఆకోజు వరదాచారి, మేకల తిరుపతి, మాట్ల వెంకటేష్, సరుగోమ్ముల ప్రభాకర్, వేల్పుల రామస్వామి, మచ్చ రాజయ్య (ఉప సర్పంచ్), మచ్చ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
