

అంబరాన్ని అంటిన అల్ఫోర్స్ ‘మస్త్’ నూతన సంవత్సర వేడుకలు

కరీంనగర్:విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ విజయానికి నాంది పలకాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మెదులుతూ సమాజంలో ఆదర్శంగా నిలవాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వి. నరేందర్ రెడ్డి అన్నారు.

కరీంనగర్ నగరంలోని కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్ మైదానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ‘మస్త్’ పేరుతో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి విద్యార్థులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

వేడుకల ప్రారంభానికి ముందు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన డా. నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థలు 2025 సంవత్సరంలో ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నిలిచాయని హర్షం వ్యక్తం చేశారు.

ఈ విజయాల పరంపరను 2026 సంవత్సరంలో మరింత ఉత్సాహంతో కొనసాగిస్తూ, భారతదేశ అత్యుత్తమ అధ్యాపకుల సహకారంతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుని జోష్ నింపాయి.

