
ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
డోన్:కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ తెలుగు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు సుబ్బు యాదవ్, జల్దుర్గం నాగరాజు, షాహిన్, ఆదిల్, దాదా ఖలందర్, మబ్బు తదితరులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డోన్ సీఐ ఇంతియాజ్ భాషా, డోన్ రూరల్ సీఐ రాకేష్, ప్యాపిలి ఎస్ఐ నాగార్జున, డోన్ రూరల్ ఎస్ఐ మమత, జల్దుర్గం ఎస్ఐ అనిల్ కుమార్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. యువత, రాజకీయ నాయకులు సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆకాంక్షించారు.
