
జమ్మికుంట, జూన్ 19 (జిందగీ 9 న్యూస్):
ఆయుష్ కమిషనర్, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి ఆదేశానుసారం, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా విద్యార్థినులకు యోగాసనాలపై అవగాహన కల్పించి, యోగా శిక్షణను అందించారు. అలాగే ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినుల ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. అవసరమైన వారికి ఉచిత మందుల పంపిణీ కూడా నిర్వహించబడింది.
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు మరియు కిటకజనిత వ్యాధులపై అవగాహన కల్పించి, రోగ నిరోధకత పెంచుకునే జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతపై విద్యార్థినులను చైతన్యపరిచారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. రవీందర్ రావు, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ డి. సంధ్యారాణి (ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు), హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. మోహన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ నదియా ఫార్నాజ్, హెల్త్ సూపర్వైజర్ అరుణ, యోగ ఇన్స్ట్రక్టర్లు దేవునూరి శ్రీనివాస్, సత్యసాయిలత, రమ, ANM సరళ, రమ, కళ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
