
జమ్మికుంట: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై జరిగిన దాడి, అక్రమ అరెస్టులంటూ వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సజ్జద్ మహమ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంటలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సజ్జద్ మహమ్మద్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను సహించబోమని, సామాన్య పౌరుల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్వహణపై తలెత్తిన అభ్యంతరాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు, అరెస్టులు కొనసాగితే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే జమ్మికుంట కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ చంద రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, దౌలత్, ప్రధాన కార్యదర్శులు శనిగరపు తరుణ్, పంజాల అజయ్, పాతకాల రమేష్, NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి పర్వేజ్, బాబర్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బూడిగే శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, వేవునూరి వినయ్, అకినపల్లి శ్యామ్ కళ్యాణ్, సేవాదళ్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు వొళ్ళాల రవి, టెంకురాల కిషోర్, మరపల్లి అజయ్, రాజేష్, ఇమ్రాన్, రాచపల్లి రాజశేఖర్, శనిగరపు రాజు, శివ, కోలుగురి రవి, సమీర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే NSUI నాయకులు, రాజవంశన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
