ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య.. హార్పిక్‌ను నరాల్లోకి ఎక్కించి దారుణం

నిజామాబాద్, జూలై 6 (Zindagi9news): నిజామాబాద్ శివారులోని న్యాల్కల్లో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌కు వెళ్లిన భర్త ప్రశాంత్ తిరిగి స్వగ్రామానికి వచ్చిన తర్వాత భార్య సంధ్య వివాహేతర సంబంధం విషయం తెలుసుకుని ఆమెను మందలించాడు. దీంతో తన ప్రియుడు అనిల్‌తో కలిసి భర్తను హత్య చేయాలని సంధ్య పథకం రచించింది. ముందుగా ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి మత్తులోకి వెళ్లేలా చేసింది. అనంతరం ప్రియుడు అనిల్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి తీవ్రంగా దాడి చేసి భవనం పై నుంచి కిందకు తోసేశారు. అయినప్పటికీ ప్రాణాలతో ఉండటంతో సిరంజిలో హార్పిక్ లిక్విడ్ తీసుకుని భర్త నరాల్లోకి ఎక్కించినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్దిసేపటికే ప్రశాంత్ మృతి చెందగా, ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో భార్య సంధ్య, ఆమె ప్రియుడు అనిల్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
