ఎథిక్స్ ఎవరికుంది..? అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకా.. మాకా?: కౌశిక్ రెడ్డి ఫైర్
ఎథిక్స్ కమిటీ విచారణపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హుజూరాబాద్: ఎథిక్స్ కమిటీ విచారణపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు ఎథిక్స్ ఎవరికుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరుగుతున్న ఎమ్మెల్యేలకా? లేక అధికారంలో లేకపోయినా ఏ పార్టీ నుంచి గెలిచామో అదే పార్టీ వైపు నిలబడి ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకా? అని ప్రశ్నించారు.
సోమవారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విలేకరులతో నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
“అసలు ఎథిక్స్ లేనిది ఎవరికీ..? బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగేటోళ్లకా? అధికారంలో లేకపోయినా ఏ పార్టీ నుంచి అయితే గెలిచామో ఆ పార్టీ వైపే నిలబడి ప్రజా సమస్యలపై కొట్లాడేటోనికా? అసలు ఎథిక్స్ ఉన్నది ఎవరికీ..? మాకా.. అమ్ముడుబోయినోడికా..? ఎథిక్స్ కమిటీనే ఆలోచన చేసుకోవాలి ఎవరికి ఎథిక్స్ ఉన్నాయో” అంటూ కౌశిక్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
