ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే హుజురాబాద్లో తిరగనివ్వం: ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్

జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఒక సైకోలా, రౌడీలా ప్రవర్తిస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ తిరగనివ్వబోమని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
జమ్మికుంటలో శుక్రవారం గరుడ వస్త్ర సిల్క్స్ – ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన బల్మూరి వెంకట్, ముందుగా తనకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సర్పంచ్లకు, తనను సొంత కుటుంబ సభ్యుడిలా భావించే హుజురాబాద్ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
- కల్వకుంట్ల కుటుంబానికే వత్తాసు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ, హుజురాబాద్ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. దొర మోచేతి నీళ్లు తాగుతూ కల్వకుంట్ల కుటుంబానికి వత్తాసు పలుకుతున్నారే తప్ప, స్థానిక సమస్యలపై ఎక్కడా మాట్లాడటం లేదని మండిపడ్డారు.
- ఎథిక్స్ కమిటీకి రిఫర్: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఒక గూండాలా, రౌడీలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నందుకే ఆయన వ్యవహారాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసినట్లు తెలిపారు. ఎథిక్స్ కమిటీ తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాత జరిగే పరిణామాల్లో హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- ఎమోషనల్ డ్రామాతో గెలుపు: గత ఎన్నికల్లో తనను గెలిపించకపోతే చచ్చిపోతానని కుటుంబ సమేతంగా ఎమోషనల్ డ్రామా ఆడితే, మన ప్రాంత బిడ్డ అని ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినా, అడ్డగోలుగా ఇబ్బందులు పెట్టినా ప్రజలు క్షమించి గెలిపించారని అన్నారు.
- అభివృద్ధిపై నిర్లక్ష్యం: ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల అభివృద్ధి, ఇల్లందకుంట దేవాలయం, బిజ్గిర్ షరీఫ్ దర్గా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
- గ్రామాల్లో తిరగనివ్వం: “కౌశిక్ రెడ్డీ.. నీ ప్రవర్తన ఒక సైకోలా ఉంది. నీకు మూడేళ్ల సమయం ఇచ్చాం, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏ గ్రామంలో కూడా నిన్ను తిరగనివ్వం” అని బల్మూరి వెంకట్ తేల్చి చెప్పారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
