యూపీఎస్సీ-2027 ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు దరఖాస్తులు.. బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, జూలై 14 (జిందగి9న్యూస్): తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (TGBCESDTC), బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) పరీక్షకు ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం అర్హులైన గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కోచింగ్ ఆగస్టు 24, 2026 నుంచి మే 2027 వరకు హైదరాబాద్‌లోని సైదాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న టీజీ బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించనున్నారు.
మొత్తం 150 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
• 100 మంది అభ్యర్థులను ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
• ఇప్పటికే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 50 మందిని స్క్రీనింగ్ టెస్ట్ లేకుండానే అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి లభించే సౌకర్యాలు:
• నెలకు రూ.5,000 స్టైపెండ్ (హాజరు నిబంధనలకు లోబడి)
• రూ.5,000 బుక్ ఫండ్ (ఒకేసారి)
• లైబ్రరీ సౌకర్యం
• అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన
• సబ్జెక్ట్వారీ పరీక్షలు, మూల్యాంకనం, ఫీడ్‌బ్యాక్
అర్హతలు:
• గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
• తల్లిదండ్రుల వార్షిక ఆదాయం: • గ్రామీణ ప్రాంతం: రూ.1.50 లక్షల లోపు
• పట్టణ ప్రాంతం: రూ.2 లక్షల లోపు
• ఉద్యోగంలో ఉండకూడదు లేదా ఇతర కోర్సు చదువుతూ ఉండకూడదు.
• ప్రభుత్వ ప్రాయోజిత ఇలాంటి కోచింగ్‌ను గతంలో పొందకూడదు.
• యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 అర్హత ప్రమాణాలను పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
• నోటిఫికేషన్ విడుదల: జూలై 15, 2026
• ఆన్లైన్ దరఖాస్తులు: జూలై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు
• హాల్‌టికెట్ డౌన్లోడ్: ఆగస్టు 13 నుంచి
• స్క్రీనింగ్ పరీక్ష: ఆగస్టు 16, 2026
• ఫలితాలు: ఆగస్టు 19, 2026
• సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఆగస్టు 21 నుంచి
• తరగతుల ప్రారంభం: ఆగస్టు 24, 2026
దరఖాస్తులు టీజీ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. మరిన్ని వివరాలకు 040-24071178, 7780359322 నంబర్లను సంప్రదించవచ్చు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
