రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
మృతుడి వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ విజ్ఞప్తి

రామగుండం, జూలై 7 (Zindagi9news): పోత్కపల్లి–బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య మానేరు వంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జైపూర్ ఎక్స్ప్రెస్ దిగువ లైన్లో వెళ్తుండగా సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తెలిపారు.మృతుడు ఆకుపచ్చ రంగు ఫుల్ షర్ట్, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర వస్తువులు లభించలేదని వెల్లడించారు. మృతదేహాన్ని రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.ఈ ఘటనపై జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99493 04574 లేదా 87126 58604 నంబర్లకు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
