క్షుద్ర పూజలు, మంత్రాల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్ట్

సిరిసిల్ల: అనారోగ్యాన్ని నయం చేస్తామని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను సిరిసిల్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. తురుపాటి శ్యాం కుమార్, పత్తెం లక్ష్మీరాజం అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అనారోగ్య సమస్యను నయం చేస్తామని నమ్మించి ఓ మహిళను నిందితులు మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ.30.50 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, క్షుద్ర పూజలకు ఉపయోగించే పూజా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేష్తో పాటు పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
అనారోగ్య సమస్యలకు క్షుద్ర పూజలు, చేతబడులు, మంత్రాలు పరిష్కారం కాదని పోలీసులు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందాలని తెలిపారు. మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తే నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
