మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

సిరిసిల్ల, ఆగస్టు 31: మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు యాటెల్లి విజయ్‌కు రూ.5 వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తంగళ్లపల్లికి చెందిన మైనర్ బాలిక 2021 నవంబర్ 24న ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు విజయ్ బాలికను అపహరించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించి కోర్టులో సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది.
కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించిన పోలీసు సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించినట్లు సమాచారం.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
