టీజీపీఎస్సీ నోటిఫికేషన్.. 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు

హైదరాబాద్, జూలై 2(Zindagi9news): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 రాష్ట్రస్థాయి పోస్టులకు జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు వేతనం అందించనున్నారు. వ్యవసాయంలో బేసిక్ డిగ్రీతో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీలో ఎంఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులని టీజీపీఎస్సీ తెలిపింది. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఇతర వివరాలు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
