నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్న్యూస్.. ప్రతి నెలా 2-3 నోటిఫికేషన్లు

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం శుభవార్త చెప్పారు. ఇకపై ప్రతి నెలా 2 నుంచి 3 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఈ నెలలోనే 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
రేపే మూడు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అదేవిధంగా, సాంప్రదాయ OMR విధానంలో పరీక్షలు నిర్వహించడం క్లిష్టంగా మారడంతో ఇకపై ఉద్యోగ నియామక పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ విధానంలో పరీక్ష పూర్తైన వెంటనే అభ్యర్థులకు మార్కులు తెలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
టీజీపీఎస్సీ చేపడుతున్న ఈ మార్పులు నియామక ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచడంతో పాటు నిరుద్యోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
