హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET-2025) నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తు ప్రక్రియ:
• ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 25, 2025 నుండి ప్రారంభం.
• దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా): ఏప్రిల్ 4, 2025.
• ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీలు:
రూ.250 జరిమానాతో – ఏప్రిల్ 9
రూ.500 జరిమానాతో – ఏప్రిల్ 14
రూ.2,500 జరిమానాతో – ఏప్రిల్ 18
రూ.5,000 జరిమానాతో – ఏప్రిల్ 24
పరీక్ష తేదీలు:
అగ్రికల్చర్ & ఫార్మసీ: ఏప్రిల్ 29, 30, 2025
ఇంజినీరింగ్: మే 2, 3, 4, 5, 2025
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను https://tgche.ac.in/ సందర్శించాలి.
