AIతో నకిలీ OMR షీట్లు సమర్పిస్తే జైలుశిక్ష..! NTA తీవ్ర హెచ్చరిక
NEET-UG 2026 ఫిర్యాదుల నేపథ్యంలో కీలక అడ్వైజరీ
ఫేక్ లేదా AI జనరేటెడ్ OMR షీట్లు సమర్పిస్తే కఠిన చర్యలు
ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలిస్తున్నట్లు NTA వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 18 (Zindagi9News): NEET-UG 2026 ఫలితాల్లో మార్కుల తేడాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అడ్వైజరీ జారీ చేసింది. సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థులు లేదా వారి తల్లిదండ్రులు ఫేక్ లేదా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించిన OMR షీట్లు, ఇతర నకిలీ పత్రాలను సమర్పించవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుతున్న ప్రతి ఫిర్యాదును అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
ఎవరైనా ఫోర్జరీ చేసిన పత్రాలు లేదా AI సృష్టించిన నకిలీ OMR షీట్లు, ఇతర డాక్యుమెంట్లను సమర్పించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని NTA హెచ్చరించింది. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుశిక్ష వంటి చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం OMR షీట్ల మూల్యాంకనం, అభ్యంతరాల పరిశీలన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపిన NTA, అభ్యర్థులు అధికారిక విధానాల ద్వారానే ఫిర్యాదులు నమోదు చేయాలని, ఎలాంటి నకిలీ లేదా AI రూపొందించిన పత్రాలను ఉపయోగించవద్దని సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
