గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: కరీంనగర్ జిల్లా అధికారి ప్రకటన
కరీంనగర్: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (ITDA) కె. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సమన్వయంతో, కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో గల నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలో మే 2026 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్ కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన యువత నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
శిక్షణ ఇచ్చే కోర్సులు:
- ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ (ఆయిల్ & గ్యాస్)
- ఇండస్ట్రియల్ వెల్డర్ (ఆయిల్ & గ్యాస్)
- ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్
- ఫిట్టర్ ఫాబ్రిికేషన్
- టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్
కోర్సు వ్యవధి: 6 నెలలు (పూర్తి స్థాయి రెసిడెన్షియల్ శిక్షణ).
అర్హతలు: టెక్నికల్ డిప్లొమా పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు ITI ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
వయోపరిమితి: 25 సంవత్సరాలు (ST అభ్యర్థులకు 2 ఏళ్ల సడలింపు ఉంటుంది).
వసతులు: శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్స్, యూనిఫాం మరియు సేఫ్టీ షూస్ అందించబడతాయి.
సర్టిఫికేషన్ & ప్లేస్మెంట్: శిక్షణ అనంతరం ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ ద్వారా సర్టిఫికేట్ అందజేయబడుతుంది. అలాగే అర్హులైన వారికి ప్లేస్మెంట్ (ఉపాధి) అవకాశం కల్పించబడుతుంది.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల గిరిజన యువతీ యువకులు (స్త్రీ/పురుషులు) ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు లింక్: http://dsapponline.com/sds/form/register.php
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2026.
అర్హులైన గిరిజన యువత ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని జిల్లా అధికారి కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
