జమ్మికుంట మీదుగా ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
జమ్మికుంట మీదుగా సికింద్రాబాద్–కాగజ్‌నగర్ ప్రత్యేక రైళ్లు

జమ్మికుంట, సెప్టెంబర్ 4(Zindagi9news): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–కాగజ్‌నగర్ మధ్య రెండు జనసాధారణ (అన్రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు జమ్మికుంట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు:
రైలు నంబర్ 07235 సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు:
రైలు నంబర్ 07236 కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
రైళ్లలో అన్ని సాధారణ బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జమ్మికుంట ప్రాంత ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
