జమ్మికుంట–పోత్కపల్లి మధ్య సిగ్నలింగ్ పనులు.. నేడు పలు రైళ్లకు అంతరాయం

జమ్మికుంట, సెప్టెంబర్ 9: కాజీపేట–బల్హార్షా సెక్షన్లోని జమ్మికుంట–పోత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి నాన్-ఇంటర్లాకింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా నేడు (సెప్టెంబర్ 9), రేపు (సెప్టెంబర్ 10) పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడనుంది.
నేడు కొన్ని రైళ్లను మార్గమధ్యంలో నియంత్రించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
నేడు ఆలస్యంగా నడిచే రైళ్లు
- 22365 దానాపూర్–SMVT బెంగళూరు: 75 నిమిషాలు
- 22366 SMVT బెంగళూరు–దానాపూర్: 45 నిమిషాలు
- 16031 చెన్నై సెంట్రల్–SMVD కత్రా: 30 నిమిషాలు
- 12622 న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్: 30 నిమిషాలు
ఈ రైళ్లను మార్గమధ్యంలో కొంత సమయం నియంత్రించడంతో ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది.
రేపు పలు రైళ్లు రద్దు
సెప్టెంబర్ 10న 17003 కాజీపేట–సిర్పూర్ టౌన్, 17004 బల్హార్షా–కాజీపేట రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
అదేవిధంగా 17033, 17034, 17011, 17012 రైళ్లను కొన్ని మార్గాల్లో పాక్షికంగా రద్దు చేయనున్నారు. 17233, 67771, 67773 రైళ్లను 60 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేయనున్నారు.
ప్రయాణికులు నేడు, రేపు రైలు ప్రయాణం చేసే ముందు తమ రైలు సమయం, రద్దు లేదా మార్గ మార్పులను పరిశీలించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
