
నిజామాబాద్ రూరల్ (సిరికొండ), అక్టోబర్ 14(Zindagi9news): పోత్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంజుల బాలయ్య దంపతులు మంగళవారం దుర్గమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిపూర్వకంగా ఒడిబియ్యం సమర్పించి, పట్టుచీరతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
