పాఠశాల సిబ్బందికి రూ.16 వేల విలువైన వాటర్ డిస్పెన్సర్ అందజేత

జూలూరుపాడు, సెప్టెంబర్ 16 (Zindagi9news): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడులో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందిన వెన్న ఉదయ సేత్ పాఠశాల సిబ్బందికి రూ.16 వేల విలువైన వోల్టాస్ కంపెనీ వాటర్ డిస్పెన్సర్‌ను అందజేశారు. తన ఉద్యోగ జీవితానికి గుర్తుగా సిబ్బంది వినియోగం కోసం వాటర్ కూలర్, మినీ ఫ్రిజ్‌తో కూడిన వాటర్ డిస్పెన్సర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్యకు అందించారు.
ఈ సందర్భంగా ఉదయ సేత్ మాట్లాడుతూ.. జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించిన సమయంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో, గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. పాఠశాలతో ఏర్పడిన ఆత్మీయ అనుబంధానికి గుర్తుగా సిబ్బందికి ఉపయోగపడేలా వాటర్ డిస్పెన్సర్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా పాఠశాల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ వాటర్ డిస్పెన్సర్ అందజేయడం పట్ల ప్రధానోపాధ్యాయులు టి. లక్ష్మీనరసయ్య, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ఉదయ సేత్‌ను అభినందించారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఆయన అందించిన సేవలను, పాఠశాల పట్ల చూపిన అభిమానాన్ని సిబ్బంది కొనియాడారు.
జిందగీ 9 న్యూస్ | గోలి శ్రీను, న్యూస్ రిపోర్టర్ | జూలూరుపాడు
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
