జమ్మికుంటలో రైస్ మిల్ ప్రమాదం.. కార్మికుడు మృతి, కేసు నమోదు

జమ్మికుంట: రైస్ మిల్లులో కూలి పనికి వెళ్లిన కార్మికుడు ప్రమాదవశాత్తు యంత్రం మీద పడటంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగంపేట గ్రామానికి చెందిన కన్నూరి మొగిలి (50) ఈ నెల 29న జమ్మికుంటలోని మహేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో కూలి పనికి వెళ్లాడు. పని చేస్తున్న సమయంలో రైస్ మిల్లులోని డస్ట్ మెషిన్ ప్రమాదవశాత్తు మొగిలిపై పడింది. దీంతో ఆయన ఛాతీ, తలపై తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే మొగిలిని జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8న మొగిలి మృతి చెందాడు.
మృతుడి కుమార్తె కన్నూరి రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, రైస్ మిల్లో భద్రతా చర్యలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
