
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు గడువు అభ్యర్థన
హైదరాబాద్, మే 13 (Zindagi9News): పోక్సో కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కోరుతూ, మే 15న సంబంధిత ఆధారాలతో విచారణాధికారి ఎదుట హాజరవుతానని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
తనపై నమోదైన కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు, ఆధారాలను సమర్పించాల్సి ఉన్నందున గడువు కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు లేఖను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుడు సమర్పించనున్న ఆధారాలపై విచారణాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే, గడువు మంజూరుపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.
