బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జూన్ 10న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మే 13 (Zindagi9News): 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పెద్దపల్లి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో 1వ, 5వ తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్)కు 70 సీట్లు, 5వ తరగతి (రెసిడెన్షియల్)కు 73 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని తెలిపారు.
1వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని, ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికే ప్రవేశానికి అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థులు మే 16 నుంచి జూన్ 5 వరకు జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు.
పూర్తి చేసిన దరఖాస్తులను కులం, ఆదాయం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు తదితర ధ్రువీకరణ పత్రాలతో జతచేసి జూన్ 6 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తుల ఆధారంగా జూన్ 10న లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు చేపడతామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని లేదా 9618844454, 9989354155 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
