
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్కు రూ.3కు పైగా పెంపు
హైదరాబాద్, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3కు పైగా పెంపు అమల్లోకి వచ్చింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి.
తాజా పెంపుతో ప్రజలపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా నిత్యావసర సరుకుల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో దాని ప్రభావం సాధారణ ప్రజలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.86కు చేరుకోగా, డీజిల్ ధర రూ.98.96గా నమోదైంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరిగినట్లు సమాచారం. పెరిగిన ఇంధన ధరలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
