ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు
ఉద్యోగులకు ఊరటనిచ్చే మార్పులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను నిబంధనలను ప్రకటించింది. సిటీలో నివసించే వారికి HRA మినహాయింపును 50% వరకు పెంచారు. పిల్లల విద్యా అలవెన్స్ రూ.300 నుండి రూ.3000 వరకు పెరిగింది. PAN కార్డు వినియోగంపై కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. కార్, డ్రైవర్ ఖర్చులపై అదనపు క్లెయిమ్ అవకాశాలు కల్పించారు. రూ.15,000 పైబడిన బహుమతులపై పన్ను విధించనున్నారు. పాత సెక్షన్లను తగ్గించి, కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు.
