ట్రాలీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం – యువకుడికి గాయాలు
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం RT వైన్స్ వద్ద ఆగి ఉన్న ట్రాలీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోత్కులగూడెం గ్రామానికి చెందిన బిట్ల కిరణ్ గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
