ANM పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. జూలై 15 వరకు అభ్యంతరాలకు అవకాశం

హైదరాబాద్, జూలై 12 (జిందగి9న్యూస్): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) (ANM) పోస్టుల భర్తీకి సంబంధించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కులు, కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ సేవలకు కేటాయించిన వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది.
గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాపై మే 18 నుంచి 22 వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన అనంతరం తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం మరోసారి అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు జూలై 13 నుంచి జూలై 15 సాయంత్రం 5 గంటల వరకు MHSRB అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుందని, కాబట్టి అభ్యర్థులు పూర్తి వివరాలను పరిశీలించి జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
