నారాయణ స్కూల్లో ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు
రెండు గదులు సీజ్.. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయం గుర్తింపు

హైదరాబాద్, జూన్ 25(Zindagi9news): హయత్నగర్ మండల విద్యాధికారి (ఎంఈఓ) వనస్థలిపురంలోని నారాయణ స్కూల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ్యపుస్తకాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి రెండు గదులను సీజ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు, పుస్తకాల ధరలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఇలాంటి ఉల్లంఘనలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
