టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో కోచింగ్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్, జూన్ 26 (జిందగీ9న్యూస్): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs) లో ఐఐటీ-జేఈఈ, నీట్, సీఎంఏ, క్లాట్, యూపీఎస్సీ కోర్సులకు బోధించేందుకు ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హతలు కలిగిన, బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు వాక్-ఇన్ విధానంలో ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలని సంస్థ తెలిపింది.
మొత్తం 117 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ఫౌండేషన్ & సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ పోస్టులు 50, డిసిప్లిన్ ఫ్యాకల్టీ పోస్టులు 67 ఉన్నాయి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సీఎంఏ, క్లాట్, యూపీఎస్సీ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలతో జూన్ 25 నుంచి జూన్ 30, 2026 మధ్య సంబంధిత వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి, అనంతరం షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
డిసిప్లిన్ ఫ్యాకల్టీకి గంటకు రూ.250 (నెలకు గరిష్టంగా రూ.32,500 వరకు), ఫౌండేషన్ & సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీకి గంటకు రూ.650 (రోజుకు గరిష్టంగా 7.5 గంటల వరకు) పారితోషికం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://tgswreis.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 040-23005100 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
