LPG సిలిండర్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. ఇక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 రోజులే

న్యూఢిల్లీ: దేశీయ వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో LPG రీఫిల్ సిలిండర్ బుకింగ్‌కు మధ్య వ్యవధి 25 రోజులుగా ఉండనుంది. ఈ సవరించిన నిబంధనను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తక్షణమే అమలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం LPG సరఫరా పరిస్థితి మెరుగుపడటం, రీఫిల్ బుకింగ్‌ల పెండింగ్ సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఈ పరిమితిని సడలించినట్లు ఆయన తెలిపారు.
ఇటీవల పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో LPG సరఫరాపై ఒత్తిడి ఏర్పడటంతో పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల వ్యవధి ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి అమల్లో ఉంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వ్యవధిని 25 రోజులకు తగ్గించారు.
దీంతో దేశవ్యాప్తంగా దేశీయ LPG వినియోగదారులకు బుకింగ్ వ్యవధి విషయంలో ఒకే విధానం అమల్లోకి రానుంది. సవరించిన నిబంధనను అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెంటనే అమలు చేయాలని కేంద్రం సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
