ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు.. రూ.20 లక్షలకు పైగా ఆదాయం

ఇల్లందకుంట, ఏప్రిల్ 10 (zindagi9news) : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2026 బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. మార్చి 17 నుండి ఏప్రిల్ 10 వరకు 24 రోజుల వ్యవధిలో ఆలయానికి మొత్తం రూ.20,39,551 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారం 6 గ్రాములు, మిశ్రమ వెండి 225 గ్రాములు లభించాయి.
ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం కరీంనగర్ డివిజన్ పరిశీలకులు పి. సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగింది. కార్యక్రమంలో అర్చకులు శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్ కుమార్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్ పాల్గొన్నారు.
ఇక సిబ్బంది మోహన్, మల్లారెడ్డి, సురేందర్ రావు, రమేష్, రాజు, ప్రవీణ్ తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
