IIT-JEE (Main) 2025 ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు అద్భుత విజయాన్ని సాధించాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ పరీక్షలో విద్యార్థులు సాధించిన ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
ఈ సంవత్సరం 49 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు సాధించగా, అనేక మంది టాప్ 500 ర్యాంకుల్లో నిలిచారు. ముఖ్యంగా:
1000 లోపు ర్యాంకులు – 11 మంది
2000 లోపు ర్యాంకులు – 21 మంది
5000 లోపు ర్యాంకులు – 40 మంది
మొత్తంగా 459 మంది విద్యార్థులు JEE Advanced కోసం అర్హత పొందారు. విద్యార్థుల కృషితో పాటు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల బోధనా నాణ్యత, అకడమిక్ పద్ధతులు ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయి.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల డైరెక్టర్ డా. ఎ. సరందర్ రెడ్డి మాట్లాడుతూ –
“ఈ అద్భుతమైన విజయానికి మా టీచింగ్ స్టాఫ్, విద్యార్థుల కృషి కారణం. రాబోయే JEE Advanced, NEET వంటి పరీక్షల్లోనూ మరిన్ని విజయాలు సాధించేందుకు మేము విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం” అని తెలిపారు.
ఇక NEET వంటి ఇతర పోటీ పరీక్షల్లోనూ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
