చార్మినార్‌లో H-FAST దాడులు.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం

హైదరాబాద్‌లోని హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో చార్మినార్ న్యూ లాడ్ బజార్లో లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్న M/s అల్ అక్బర్ గోడౌన్‌పై H-FAST అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, ఆరు టిన్ల వాడిన నూనె, అలాగే కృత్రిమ రంగులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
