క్రైస్తవ మైనారిటీలకు ఆర్థిక సహాయ పథకం
జూలై 3 నుంచి 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు

హైదరాబాద్, జూలై 2(Zindagi9news): తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్రైస్తవ మైనారిటీల కోసం ఆర్థిక సహాయ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానించింది. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల వారు, ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్ల కోసం 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షలలోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలలోపు ఉన్న క్రైస్తవ మైనారిటీ అభ్యర్థులు అర్హులని పేర్కొంది. జూలై 3 నుంచి జూలై 18 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. మరిన్ని వివరాలకు 040-23391067 నంబర్‌ను సంప్రదించవచ్చని లేదా www.tgcmfc.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
