ఉప్పల్లో పార్క్ చేసిన ఎర్టిగా కారులో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

హైదరాబాద్ (ఉప్పల్), అక్టోబర్ 14 (జిందగీ 9 న్యూస్): హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పార్క్ చేసి ఉంచిన మారుతీ సుజుకీ ఎర్టిగా కారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో కారు ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా కారు ఇంజిన్ భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కారు అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
