విద్యాసంస్థల బంద్కు పిలుపు.. కరీంనగర్లో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులతో ఉద్రిక్తత

కరీంనగర్, జూలై 10 (జిందగి9న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా జూలై 10, శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్కు మద్దతుగా కరీంనగర్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. PDSU, SFI, AISF, AIFDS, AISB ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ విజయవంతం చేయాలని ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. విద్యా సమస్యల పరిష్కారం, విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
బంద్కు మద్దతుగా నిరసన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించగా, పోలీసులు వారిని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
